Politics : సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దేశ సంపదను కాంగ్రెస్ ముస్లింలకు ఇవ్వాలని చూస్తోంది అన్న కామెంట్స్ మీద కాంగ్రెస్ నేతలు అందరూ స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా కూడా దీని గురించి మాట్లాడారు.

Social Media : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు..వాటి మీమ్స్..
New Update

Sam Pitroda Explains : ప్రస్తుతం సంపద పునః పంపిణీ మీద దేశంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్‌(Congress) ల మధ్య వచ్చిన ఈ డిస్కషన్ ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడుకునేలా చేసింది. దీంతో ఈ విషయం మీద కాంగ్రెస్ ఇండియన్ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా(Sam Pitroda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో సంపన్నుల డబ్బులు మొత్తం అంతా వారిదేనా...లేక ప్రభుత్వానికి, దేశ ప్రజలకు చెందాలా అనే విషయం మీద ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. దీని మీద కాంగ్రెస్ ఓవర్ససీస్ ఛైర్మన్ శామ్ సిట్రోడా స్పందించారు. ఇదొక ఇంట్రస్టింగ్ టాపిక్ అని ఆయన అన్నారు. యూఎస్ లా ప్రకారం అక్కడ ఎవరికైనా 100 మిలియన్ల సంపద ఉంటే వారు తమ కుటుంబానికి 45 శాతం ఇవ్వాలి. మిగతా 55 శాతం ప్రభుత్వానికే చెందుతుంది. ఇది అమెరికా(America) లో ఒక లా అని చెప్పారు శ్యామ్ పిట్రోడా. దీన్ని ఎవ్వరైనా పాటించాల్సిందే. కానీ మన దేశంలో అలాంటిది ఏమీ లేదు. నిజంగా అయితే ఇది చర్చించాల్సిన విషయం. మన దేశంలో 100 మిలియన్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని పిల్లలకే మొత్తం వెళుతుంది. అలా అయితే సంపద అంతా ఒక చోటనే కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాతోంది. దేశంలో ఉన్న సంపద అందరికీ సమానంగా ఉండాలని తమ పార్టీ భావిస్తోందని శ్యామ్ పిట్రోడా అన్నారు. అందుకే సంపద పునః పంపిణీ గురించి తాము మాట్లాడుతున్నామని చెప్పారు.

దేశంలో సంపద, అసమానతలు వీటి మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని గురించి పూర్తిగా సర్వేలు నిర్వహించాలని అనుకుంటున్నాము. అది దృష్టిలో పెట్టుకునే తమ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చేశారని శ్యామ్ పిట్రోడా చెప్పారు. ఇక తమ మేనిఫేస్టోలో కూడా ఇదే విషయాలను పొందుపరిచామని అన్నారు. ధనవంతులు, పేదలు రెండు వర్గాలుగా విడిపోయి దేశంలో ఆర్ధిక అసమానతలు, సమానత్వం ఇలాంటి విషయాలు బాగా దెబ్బ తీస్తున్నాయి. 2014 నుంచి ఈ అసమానతలు బాగా పెరిగిపోయాయని శ్యామ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే తాము వాటి మీద ఫోకస్ పెట్టామని...అవే మేనిఫెస్టోలో రూపొందించామని చెప్పారు. నిజానికి ఈ అర్ధిక అసమానతలు గురించి రాహుల్ గాంధీ ఎప్పుడో ఏప్రిల్ 6న ప్రకటించారు. కానీ రీసెంట్‌గా ప్రధాని మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోను, అందులో ఉన్న అంశాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది.

Also Read : ఖగోళంలో అద్భుతం..జీరో షాడో డే ఈరోజు

మోదీ ఏమన్నారంటే..

కాంగ్రెస్ మేనిఫెస్టో మీద మోదీ విరుచుకుపడ్డారు. దేశంలో సంపదను అంతా కాంగ్రెస్ ముస్లింలకు పంచి ఇవ్వాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ను విశ్వసించడం కష్టమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరం అవుతుందని అన్నారు.

#congress #pm-modi #bjp #politics #sam-pitroda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe