Floods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది

గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుల్లో పడ్డారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన 80 మంది వరదల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్యూ టీం వాళ్లని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది.

New Update
Floods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది

Goa Waterfall : గోవా (Goa) లో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టు (Tourists) లకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన 80 మంది వరదల్లోనే చిక్కుకుపోయారు. సమాచారం మేరకు రెస్క్యూ బృందాలు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకుని వాళ్లని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 'ఆదివారం సెలవు రోజు కావడంతో గోవాలోని సత్తారి తాలుకాలో పాలి అనే జలపాతానికి చాలా మంది పర్యాటకులు వెళ్లారు.

Also Read: హత్రాస్‌లో తొక్కిసలాట వారివల్లే జరిగింది.. భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు

పాలి జలపాతాన్ని చేరుకోవాలంటే ముందుగా ఓ నదిని దాటాలి. అప్పటికే అక్కడ భారీ వర్షం కురుస్తుండటంతో.. ఆ నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో 80 మంది అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం మేరకు సహాయక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఇప్పటివరకు 50 మందిని రక్షించారు. మరో 30 మంది అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లని రక్షించేందుకు రెస్యూ బృందాలు పనిచేస్తున్నాయని' అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?

Advertisment
తాజా కథనాలు