/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/BUS-3-jpg.webp)
TSRTC Record : తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress) అధికారంలోకి వచ్చాక.. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు వయసుతో సంబంధం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. చాలామంది మహిళలు ఈ పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణాల వల్ల డబ్బులు ఆదా అవుతున్నాయని.. వేరే ప్రాంతాలకి వెళ్లి తమ పనులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. దీంతో రోజురోజుకి ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే సోమవారం నాడు ఆర్డీసీలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆరోజున ఏకంగా 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) మునిశేఖర్ వెల్లడించారు.
Also Read: 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
అయితే ఆదివారం సుమారు 41 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించారు. సోమవారం నాటికి ఏకంగా 9 లక్షలు పెరిగింది. ముఖ్యంగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. అలాగే కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. అయితే ఈ రద్దీని ఆర్టీసీ ఉన్నతాధికారులు ముందుగానే ఊహించి.. రెగ్యులర్‌తో పాటు స్పేర్ బస్సలను నడిపించారు. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు కూడా వారాంతపు సెలవు తీసుకోకుండా విధుల్లో పాల్గొన్నారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
Also Read: మంత్రి కోమటిరెడ్డికి అనారోగ్యం.. యశోద ఆసుపత్రిలో చేరిక!