Crime News: సముద్రంలో ఈతకు దిగి ఐదురుగు మెడికో విద్యార్థులు మృతి..

తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం జరిగింది. సముద్రంలో ఈతకు దిగిన ఐదుగురు వైద్య విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ముగ్గురు మెడికో మహిళలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

New Update
annamaiah crime news

తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం జరిగింది. సముద్రంలో ఈతకు దిగిన ఐదుగురు వైద్య విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరుచిరాపల్లిలోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఓ వివాహ వేడుకకు వెళ్లేందుకు కన్యాకుమారికి వచ్చారు. వేడుక తర్వాత పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఆ స్టూడెంట్స్‌ పలు బృందాలుగా విడిపోయారు.

Also Read: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

అయితే కొంతమంది మెడికో స్టూడెంట్స్ కన్యాకుమారి తీరంలో ముసి ఉన్న ఓ ప్రైవేట్‌ బీచ్‌కి వెళ్లారు. ఈత కోసం సముద్రంలోకి దిగారు. అలలు పెద్ద ఎత్తున రావడంతో కొందరు విద్యార్థులు సముద్రంలో మునిగిపోయి మృతి చెందారు. మృతులు చారుకవి, గాయత్రి, సర్వదర్శిత్, ప్రవీణ్ సామ్, వెంకటేష్‌గా గుర్తించారు.

ఇక మరో ముగ్గురు మహిళా మెడికోలైన నేషి, ప్రీతి ప్రియాంక, శరణ్య ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సముద్రంలో మునిగి మృతిచెందిన మెడికో స్డూడెంట్స్ కోర్సు మరికొన్ని వారాల్లోనే ముగియనుందని చెప్పారు. తమ బిడ్డల మృతితో వారి కుటుంభ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: ఆస్ట్రేలియాలో దారుణం.. కత్తిపోట్లకు గురై భారత విద్యార్థి మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు