Andhra Pradesh: కువైట్ మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కువైట్‌ ఘోర అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాల వారికి 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 45 మంది చనిపోగా అందులో ముగ్గురు ఏపీవాసులు ఉన్నారు. కువైట్ నుంచి మృతదేహాలు స్వంత రాష్ట్రాలకు చేరుకున్నాయి.

New Update
Chandrababu Naidu: పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

కువైట్ లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారికీ 5 లక్షలు ఇస్తామని చెప్పారు. దాంతో పాటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

మరోవైపు కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు భారతదేశానికి చేరుకున్నాయి. ఇందులో కేరళ వారే ఎక్కువగా ఉన్నారు. మతదేహాల రాకతో ఢిల్లీ, కొచ్చి విమానాశ్రయాలు రోదనతో మిన్నంటాయి. విమానం నుంచి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుండగా.. అక్కడ ఉన్న వారి సన్నిహితులు తీవ్రంగా కన్నీరు మున్నీరయ్యారు. అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సి-130 జె ద్వారా శుక్రవారం స్వదేశానికి తీసుకువచ్చారు. కేరళ (23), తమిళనాడు (7), కర్ణాటక (1) నివాసితుల మృతదేహాలతో వైమానిక దళం విమానం కువైట్ నుండి మొదట కొచ్చికి చేరుకుంది. మరోవైపు అగ్నిప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి కూడా చనిపోయారు. దీంతో మరణించిన వారి సంఖ్య 46కు చేరుకుంది.

Also Read: Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్‌, అగ్రనేతలతో సమావేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు