Wrist Pain: అధిక బరువులు ఎత్తడం, చేతులతో చేసే వ్యాయామాలు, ల్యాప్‌టాప్, మొబైల్ నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల మణికట్టులో నొప్పి రావడం సహజం. లైట్ స్ట్రెచింగ్ ద్వారా నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి పరికరాలు, మందులు అవసరం లేకుండా కేవలం కొన్ని వ్యాయామాల ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
మొదటి వ్యాయామం:
ఇందులో రెండు చేతులను ముందుకు తీసుకుని పిడికిలి తెరవాలి. గట్టిగా పిడికిలి బిగించి కొద్దిసేపు వేచి ఉండి ఆ తర్వాత తెరవండి. ఇలా కనీసం 6 నుంచి 8 సార్లు చేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
రెండవ వ్యాయామం:
ఈ వ్యాయామంలో రెండు అరచేతులను కలపాలి. నమస్కార భంగిమలో ఉంచి తర్వాత అరచేతులను గట్టిగా నొక్కాలి. ఆ తర్వాత అరచేతులను తిప్పాలి, తర్వాత కిందకి ఉంచాలి, ఇలా చేయడం వల్ల మణికట్టుతో పాటు కండరాల నొప్పి తగ్గుతుంది.
మూడవ వ్యాయామం:
కుడిచేతిని ముందు వైపుకు తీసుకురండి. ఎడమ చేతితో కుడి చేతి వేళ్లను మీ వైపునకు లాగాలి, అరచేతులను కిందకి ఉంచి ఇలా రెండుమూడుసార్లు చేయాలి. ఒక చేత్తో పైకి కిందకి సాగదీయాలి, మరో చేత్తో రిపీట్ చేయాలి. రెండు చేతులతో కనీసం 4 నుంచి 5 సార్లు ఇలా చేయడానికి ప్రయత్నించాలి.
నాల్గవ వ్యాయామం:
ఈ వ్యాయామంలో స్ట్రెస్ బాల్‌ను చేతుల్లోకి తీసుకొని గట్టిగా నొక్కాలి. దీంతో మణికట్టుకు బలం చేకూరడంతో పాటు ముంజేయి బలం కూడా పెరుగుతుంది. ఇలా రెండు చేతులతో కనీసం 3 నుంచి 5 సార్లు చేయాలి.
ఐదవ వ్యాయామం:
ఈ వ్యాయామంలో చేతులను ముందు వైపునకు తీసుకురావలి. మణికట్టును ముందుగా సరైన దిశలో తిప్పాలి, ఆ తర్వాత వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా చేయడం వల్ల మణికట్టు నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.