Earthquake : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. By B Aravind 04 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Chambal : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం(Earthquake) సంభవించింది. అకస్మాత్తుగా భూకంపం రావడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center For Seismology) తెలిపింది. భూకంపం కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Also Read: ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత.. రాత్రి 9:35 గంటల ప్రాంతంలో మూడు నాలుగు సార్లు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చంబా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలో కూడా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. చంబాకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఇదిలా ఉండగా..1905న ఇదేరోజు (ఏప్రిల్ 4)న కాంగ్రా జిల్లాలో భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. Earthquake of Magnitude:5.3, Occurred on 04-04-2024, 21:34:32 IST, Lat: 33.09 & Long: 76.59, Depth: 10 Km ,Location:Chamba, Himachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/SYNmt1ew5B @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia… pic.twitter.com/Bc2FRprnWw — National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2024 Also Read : ఆ గ్రామంలోకి ఏం టచ్ చేసినా జేబుకు చిల్లే.. భారతీయ చట్టాలను పట్టించుకోని ఊరు! #earthquake #himachal-pradesh #national-center-for-seismology మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి