Indian Navy Saved : ఈ మధ్యకాలంలో.. ఎర్రసముద్రం(Red Sea), అరేబియా మహాసముద్రం(Arabian Ocean) లో వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన సందర్భాలున్నాయి. అయితే ఈ క్రమంలో దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు ఇండియన్ నేవీ(Indian Navy) రక్షణగా ఉంటోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 90కిపైగా దాడులకు జరగగా.. మొత్తం 110 మంది ప్రాణాలు కాపాడామని భారత నావీ తెలిపింది. ఇక వివరాలోల్లోకి వెళ్తే.. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వాణిజ్య నౌకల దాడులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యాలు చేశారు.
Also Read : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు: ఎస్. జై శంకర్
'గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సముద్ర జలాల్లో 90కి పైగా దాడులు జరిగాయి. ఇందులో క్షిపణులు, డ్రోన్లు(Drones), సముద్రపు దొంగల దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే తాము నిర్వహిస్తున్న ఆపరేషన్లలో 5 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. 21 నౌకలకు రంగంలోకి దింపాం. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో జరిగిన ఘటనలపై కూడా స్పందించాం. మొత్తంగా 110 మందిని రక్షించి వారి ప్రాణాలు కాపాడం. వాళ్లలో 45 మంది భారతీయులు.. మరో 65 మంది విదేశస్థులు ఉన్నట్లు' హరికుమార్ తెలిపారు.
ఇటీవల సోమాలియా సముద్రపు దొంగల చేతిలో ఓ వాణిజ్య ఓడ హైజాక్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన భారత నావీ.. ఆ వాణిజ్య నౌకను రక్షించింది. మెరైన్ కమాండోలు కిందికి దిగి మొత్తం 17 మంది బందీలను విడిపించారు. అలాగే 35 మంది సముద్రపు దొంగలను తమ అదుపులోకి తీసుకున్నారు. భారత నావీ చేసిన సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ ఈరోజు (శనివారం) ఇండియాకు తీసుకొచ్చి ముంబయి పోలీసు(Mumbai Police) లకు అప్పగించింది.
Also Read : సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు!