Floods: భారీ వరదలు.. 11 మంది మృతి, 40 మంది గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 11 మందికి పైగా చనిపోయినట్లు గుర్తించారు. మరో 40 మంది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Floods: భారీ వరదలు.. 11 మంది మృతి, 40 మంది గల్లంతు

Himachal Pradesh Floods: హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 11 మందికి పైగా చనిపోయినట్లు గుర్తించారు. మరో 40 మంది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత సైన్యంతో పాటు NDRF, CISF, ITBP, NDRF బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. జాగిలాలు, డ్రోన్లతో పాటు ఇతర పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Also Read: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు !

ఇదిలాఉండగా.. భారీ వర్షాల వల్ల కులులోని నిర్మాంద్‌, సాయింజ్‌, మలానా తదితర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. మణికరన్ ప్రాంతంలోని మలానా-2 పవర్ ప్రాజెక్ట్‌లో 33 మంది చిక్కుకున్నారు. దీంతో వారిని సహాయక సిబ్బంది రక్షించాయి. అలాగే శిమ్లాలోని రాంపుర్‌లో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 మంది గల్లంతయ్యారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు