Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

రైల్వేశాఖ నుంచి 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి 18 -36 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

Railway jobs: రైల్వేశాఖ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎడిట్ ఆప్షన్ కోసం సెప్టెంబర్ 8 వరకూ అవకాశం కల్పించింది.

పోస్టుల వివరాలు:
కెమికల్ సూపర్‌వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూప‌ర్‌వైజర్, రీసెర్చ్ పోస్టులు, జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు 7,934 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్:
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్‌‌ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి:
18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

నెగెటివ్ మార్కింగ్:
సీబీటీలో ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులో 1/3 వంతున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ సీబీటీకి హాజరైన అనంతరం బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా మాత్రమే ఆన్లైన్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు