మరో మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎక్సైజ్ పాలసీ (మద్యం విధానం) గడువు వచ్చేస్తోంది. ఈ నేపథ్యలోనే ఆబ్కారీ శాఖ మద్యం విక్రయాలపై దృష్టిపెట్టింది. MRP ధర కంటే తక్కువగా అమ్మకూడదని వ్యాపారులకు సూచిస్తోంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా.. నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు ఆపేయల్సి ఉంటుంది. అంతేకాదు ఈనెల 30 నాటికి ప్రస్తుతం మద్యం విధానం గడువు కూడా ముగుస్తుంది.
Also Read: భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాకి ఎంతవుతుందో తెలుసా..
డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్స్‌దారులు మద్యం అమ్మకాలను ప్రారంభిస్తారు. దీనివల్ల ఆ గడువులోగా మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లో ఉన్న నిల్వలు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాపారుల 27వ తేది అలాగే 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాల్సి ఉంటుంది. అయితే తక్కువ సమయం ఉండంటంతో.. వ్యాపారులు MRP ధరల కంటే తక్కువగా విక్రయించే అవకాశాలున్నాయనే కారణంతో అబ్కారీ శాఖ అధికారులు కట్టుదిట్టంగా నిఘా పెంచారు. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు అమ్మితే.. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు నేరం రుజువైతే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష కూడా పడుతుందని చెబుతున్నారు.
Also read: సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఆడియో కాల్స్ లీక్.. వైరల్!