సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఆడియో కాల్స్ లీక్.. వైరల్!

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ మరోసారి తెర మీదికి సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య అంశం వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య.. తన భర్త ప్రవీణ్ కు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణను నవ్య విడుదల చేసింది. ప్రస్తతం ఇవి వైరల్ గా మారాయి.

New Update
సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఆడియో కాల్స్ లీక్.. వైరల్!

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల వేళ మరోసారి సర్పంచ్ నవ్య (Sarpanch Navya), ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. గతంలో రాజయ్య చేసిన ఫోన్‌ కాల్స్‌ను నవ్య బయటపెట్టింది.

ALSO READ: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన!

నవ్య భర్తకు ఫోన్‌ చేసిన ఎమ్మెల్యే రాజయ్య ఫోన్ చేశారు. సర్పంచ్ నవ్య లేవనెత్తిన ఇష్యూను సెటిల్‌ చేసుకోవడానికి ఎమ్మెల్యే రాజయ్య ప్రయత్నం చేశారు. ఇక నుంచి అన్నీ మర్చిపోదామంటూ ఫోన్లో నవ్య భర్తను రిక్వెస్ట్ చేశారు రాజయ్య. ఈ నేపథ్యంలో నవ్య భర్త ప్రవీణ్‌కు ఎమ్మెల్యే రాజయ్య ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!

ఫోన్లో అవసరమైతే ఇంటికి వస్తాననన్న ఎమ్మెల్యే రాజయ్య. గొడవ సద్దుమణిగేలా మేనేజ్ చేస్తానని రాజయ్యకు ప్రవీణ్ హామీ ఇచ్చారు. మనది తండ్రీకొడుకుల బంధమన్న నవ్య భర్త ప్రవీణ్‌. ఎమ్మెల్యే పీఏకు, ఎంపీపీ కవిత మధ్య కూడా ఫోన్‌ కాల్స్‌ జరిగినట్లు తెలుస్తోంది. వాటిని కూడా సర్పంచ్‌ నవ్య బయటపెట్టింది. నవ్య మాట్లాడుతూ.. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... అందుకే ఇప్పుడు ఆ ఆడియో కాల్స్‌ బయటపెట్టినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు