Accident: ఘోర ప్రమాదం.. కార్లు, బస్సులు ఢీ.. 32 మంది మృతి

ఈజిప్టులోని కైరోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కార్లు,బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 32 మంది మృతి చెందారు. మరో 63 మంది క్షతగాత్రులయ్యారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

New Update
Accident: ఘోర ప్రమాదం.. కార్లు, బస్సులు ఢీ.. 32 మంది మృతి

ఇటీవల అమెరికాలో 158 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన మరువకముందే మరో ఘోర ప్రమాదం ఈజిప్టులో జరిగింది. ఆ దేశ రాజధాని కైరో నుంచి అలెంగ్జాండ్రియా నగరాన్ని కలిపే హైవేపై పలు కార్లు, బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 32 మంది మృతి చెందారు. మరో 63 మంది గాయాలపాలయ్యారు. ఈ మేరకు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముందుగా హైవేపై కైరో వెళ్తున్న ఓ ప్యాసెంజర్ బస్సు ఒక దగ్గర పార్క్ చేసిన కార్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరికొన్ని కార్లు, మరో రెండు ఆ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ కారు నుంచి ఆయిల్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Also Read: అది ఆసుపత్రి కాదు.. హమాస్ ఉగ్రవాద కార్యాలయం: ఇజ్రాయెల్

దీంతో అవి మిగతా వాహనాలకు వ్యాపించారు. మృతుల్లో సుమారు 18 మంది సజీవదహనమయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో మరికొందరు ఆస్పత్రిలో చనిపోగా.. వీరి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు

Also Read: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు