Telangana : తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..

తెలంగాణలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు. ఈఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల శాతం 5.8కి పెరిగింది. పురుష ఓటర్ల సంఖ్య.. కోటి 58 లక్షల 71 వేల 493 ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు.

Telangana : తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..
New Update

Telangana Voters : తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు. ఈఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల శాతం 5.8కి పెరిగింది. పురుష ఓటర్ల సంఖ్య.. కోటి 58 లక్షల 71 వేల 493 ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. ఇతరులు 2 వేల 557 మంది.. ఇక సర్వీసు ఓటర్లు 15 వేల 338 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో(Elections) 17.01 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారు. ఇక 6.10 లక్షలు ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: వీటిల్లో ఏది ఉన్నా ఓటేయొచ్చు..

మరోవైపు రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ(Lok Sabha) స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు ఉన్నారు. తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3 వేల 896 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 14 వేల మంది ఉద్యోగులు(Employees) పోస్టల్ బ్యాలెట్(Postal Ballet) ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.

Also Read: చిలకలూరిపేటలో సీఎం జగన్ బహిరంగ సభ- LIVE

#telugu-news #telangana #voters #lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe