Indian Army : జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. కుప్వారా జిల్లా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ (Indian Army) ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి టెర్రరిలస్టులు చొరబాటుకు యత్నించారు. దీంతో వాళ్లపై భద్రతా దళం కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ తర్వాత వారి నుంచి ఆయుధాలను స్వాధీవం చేసుకుంది.
Also Read: మెగా స్కామ్ 2024.. RTV చేతిలో సంచలన ఆధారాలు!
ఇదిలా ఉండగా.. ఆదివారం ధనుష్ - 2 (Dhanush - 2) అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్‌లో టెర్రరిస్టులను ఏరివేత ఆపరేషన్‌ను భద్రతా బలగాలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also read: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం