Terrorists Attack On Indian Army Van: మొన్నటికి మొన్న జమ్మూ-కశ్మీర్‌లో భారత సైనికుల వెహికల్ మీద మెరుపు దాడి చేసి ఐదుగురు జవాన్ల మరణానికి కారణం అయిన ఉగ్రవాదులు ఈరోజు మళ్ళీ కాల్పులు చేశారు. ఆరోజు తమ వాహనంపై టెర్రరిస్టులు దాడి మొదలుపెట్టిన వెంటనే భారత సైన్యం.. ప్రతిదాడులతో విరుచుకుపడింది. గాయపడిన సైనికులను రక్షించుకోవడంతోపాటు మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించింది. సడెన్‌గా దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు అప్పటికే చనిపోయారు. దాంతో మరింత మంది చనిపోకుండా ఉండేందుకు, ఆయుధాలను ఎత్తుకెళ్లిపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు జవాన్లు కష్టపడ్డారు. ఈ క్రమంలో ఒక జవాన్ తన ఒక చేతికి దెబ్బ తగిలినా రెండో చేతితో తన ఆయుధంలో బుల్లెట్లు అయ్యేవరకు కాల్పులు జరిపారని తెలిపారు.
ఆరోజు మొత్తం రెండు గంటల పాటూ పోరాటం జరిగిందని తెలుస్తోంది. భారత ఆర్మీ 5189 రౌండ్ల కాల్పులు జరిపింది. ఘటనాస్థలంలో రక్తంతో తడిసిన హెల్మెట్లు, పగిలిన వాహనాల టైర్లు, రక్షణ కవచాలను చూస్తే పోరాటం ఎంత భీకరంగా జరిగిందో తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ముగ్గురు ఉగ్రవాదులు వేర్వేరు ప్రదేశాల్లో దాక్కుని భారత జవాన్ల మీద కాల్పులు చేశారు. ఈ భీకర దాడులను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని చెబుతోంది. సైనికుల త్యాగాలు వృధా కాని...దాడికి పాల్పడ్డవారి అంతు చూస్తామని రక్షణ శాఖ చెప్పింది.