Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు..29 మంది మృతి

మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు.

New Update
Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు..29 మంది మృతి

Continues Rains: గుజరాత్‌లో మూడు రోజులుగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి అన్నదే లేకుండా పోయింది. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వామిత్ర నది పొంగి పొర్లుతోంది. దీంతో గుజరాత్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సౌరాష్ట్రలోని దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, పోరుబందర్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 గంటల వ్యవధిలోనే 5 నుంచి 20సెం.మీ వర్షపాతం నమోదైంది. దేవ్‌భూమి ద్వారకాలో బుధవారం అత్యధికంగా 18 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు వరద నీరు భారీగా గ్రామాల్లోకి వస్తుండడంతో అన్నీ కొట్టుకుపోతున్నాయి. ధావనా గ్రామంలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల్లో మొత్తం ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. ఇక వరద ప్రభాఇత ప్రాంతాల నుంచి 17వేలమందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

Also Read: Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు