Cyber Fraud: సైబర్‌ నేరగాళ్ల చేతిలో రూ.1,143 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

గత ఏడాది అక్టోబర్‌ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,143 కోట్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలోనే పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ నుంచి పలువురు ఆన్‌లైన్‌ మోసాల బారినపడి 2023 అక్టోబర్‌లో ఏకంగా రూ.26 లక్షల పోగొట్టుకున్నారని పేర్కొంది.

New Update
Cyber Fraud: సైబర్‌ నేరగాళ్ల చేతిలో రూ.1,143 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

Cyber Fraud: స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ప్రతిఒక్కరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేశాయి. అయితే చాలామంది ఆన్‌లైన్‌ మోసాల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేసే.. రెండు సంస్థలు కీలక సమాచారాన్ని బయటపెట్టాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది అక్టోబర్‌ నాటికి చాలామంది రూ.1,143 కోట్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారని వెల్లడించింది. తెలంగాణ నుంచి పలువురు 2023 అక్టోబర్‌లో ఏకంగా రూ.26 లక్షల పోగొట్టుకున్నారని పేర్కొన్నాయి. గత నాలుగేళ్లలో.. సైబర్‌సేఫ్‌ సంస్థ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజేన్సీస్ (LEA), ఫేక్‌ ఇండియన్ కరెన్సీ నోట్స్‌ కో ఆర్టినేషన్ గ్రూప్ (FCORD) సంస్థలు అక్టోబర్‌ 2023 నాటి నివేదికను విడుదల చేశాయి.

Also Read: 15 రోజుల్లోగా టాటూలు తొలగించాలి.. పోలీస్‌ శాఖ కీలక ఆదేశం

అత్యధికంగా 2022 నవంబర్‌లో ఆన్‌లైన్‌ మోసాల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 2023లో నమోదయ్యాయి. 2019లో సైబర్‌సేఫ్‌ ప్రారంభించినప్పటి నుంచి.. 2023 అక్టోబర్‌ 31 వరకు 3,75,796 కేసులు నమోదయ్యాయి. మొత్తం కలిపి బాధితులంతా రూ.1,143 కోట్లు పొగొట్టుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇందులో ఎస్బీఐ ఖాతాదారులే ఎక్కువగా ఆన్‌లైన్‌ మోసాల బారిన పడి మోసపోయారు. ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచే ఏకంగా.. 2,624 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారుల నుంచి 1,299 కేసులు నమోదయ్యాయి.

2023 అక్టోబర్‌లో కర్ణాటక ప్రజలు ఆన్‌లైన్‌ మోసాల బారినపడి రూ.23,50,53,446 కోట్లు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర రూ.16,87,00,058 కోట్లు, ఉత్తరప్రదేశ్‌ రూ.10,15,71,341 కోట్లు, తమిళనాడు రూ.5,84,11,199 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.3,23,41,316 పోగొట్టుకున్నారు. ఇక ముంబయిలోని ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2 లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆన్‌లైన్‌ మోసాల బారిన పడొద్దని సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. ఇంకా ఇలాంటి కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది.

Also Read: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు

Advertisment
తాజా కథనాలు