Telangana : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు : ఉత్తమ్ రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. By B Aravind 06 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS : రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్(Congress) లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్(KCR) అహంకారమే ఈ పరిస్థితికి కారణమని.. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే మాట్లాడుతారంటూ విమర్శించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ నీళ్లు లేక నష్టపోయిన పంటలను పరిశీలించి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. Also read: కాంగ్రెస్ లో చేరకలకు బ్రేక్.. రేవంత్ కు షాకిచ్చిన రాహుల్! ఉత్తమ్ కుమార్ రెడ్డి * కేసీఆర్ కరీంనగర్(Karimnagar) లో మాట్లాడిన ప్రతీ మాట అబద్దమే * ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారు * కేసీఆర్ లెక్క పాస్‌పోర్ట్‌లు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా పనిచేయలేదు. * ఎవరినో తొక్కడం కాదు.. ఈ ఎన్నికల్లో జనం కేసీఆర్‌ను బొంద పెడతారు. * కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో వ్యాఖ్యలు చేస్తున్నారు. * ఇరిగేషన్‌పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్ల పన్నడు * ఇవ్వాళ బ్రోకర్, జోకర్ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ ...ఆనాడు సీఎంగా ఉండి మేడిగడ్డపై ఎందుకు నోరు విప్పలేదు * కేసీఆర్ లెక్క వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారు. * సూర్యాపేటకు సాగునీళ్ళు కాదు.. తాగునీరు మాత్రమే. నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదిలారు. * సూర్యాపేట, పాలేరు కు కేసీఆర్ మొకం చూసి నీళ్ళు ఇవ్వలేదు...మా షెడ్యూల్ ప్రకారం ఇచ్చాం. * కేసీఆర్ కమిషన్ల కకుర్తి వల్లే అంబేంద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది * కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS...39 కి వచ్చింది. ఇందులో 25 మంది కాంగ్రెస్ లో చేరుతున్నారు. * ఈ కరువు కేసీఆర్ తెచ్చింది మాత్రమే....కాంగ్రెస్ తెచ్చింది కాదు. * కేసీఆర్ మాటలు ప్రజలు నమొద్దు..రాష్ట్రంలో పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్య రాదు. జూపల్లి కృష్ణారావు * కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని 8లక్షల కోట్ల అప్పు చెయ్యలేదా? * ప్రాంతీయడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి అనే సామెత ప్రకారం కేసీఆర్‌ను పాతి పెట్టాలి. * పదేళ్లలో పంట నష్టం ఎప్పుడైనా కేసీఆర్ ఇచ్చారా? * ఫామ్ హౌస్లో పండి కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపారు. * నాలుగు మాసాల కాంగ్రెస్ పాలనను చూసి కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారు. * కేసీఆర్ కుర్చివేసుకొని కడుతా అన్న హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా? * కేసీఆర్‌కు దమ్ముంటే మేడిగద్ద కాదు పాలమూరుకు పోదామా? * మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగింది. * సీఎం రేవంత్ 12సార్లు ఢిల్లీ పోయినా సోనియా, ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్నా మంత్రులను కలవలేదు. * కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా ఒక్కటి సీటు లోక్‌సభ లో రాదు. * కేసీఆర్ వ్యవహారాలను మేము పక్కన ఉండి చూశాం. కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. పొన్నం ప్రభాకర్ * మీ అత్తగారి ఊర్లో కట్టకు అటువైపు కేసీఆర్.. ఇటువైపు మేము ఉంటాం. ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూద్దామా? * సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు వేయకపోతే బతుకు కొట్టినట్లా? * చేనేత కార్మికులు నేచిన ప్రతీ బట్టను కొనాలని.. మేము రేపటి నుంచి ఫీల్డ్‌లో ఉంటాం...ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దాం. * కరీంనగర్ కు ఐదు ఏళ్ళు ఎంపిగా నేను ఉన్నా...కేసీఆర్ ఉన్నారు రచ్చ ఎలా? చేస్తారో చూద్దాం * వేములవాడ గుడిముందు చెప్పులు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళతో సమానంగా కేసీఆర్ ను చుడాల్సి వస్తది. #kcr #telugu-news #ponnam-prabhakar #uttam-kumar-reddy #jupalli-krishna-rao #brs-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి