Canada: కెనడాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి

కెనడాలో చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతను కారులో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన చిరాగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

New Update
Canada: కెనడాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి

గత కొంతకాలంగా అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు మరణించడం ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కెనడాలో విషాదం చోటుచేసుకుంది. చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతను కారులో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని సౌత్ వాంకోవర్ పోలీసులు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 12న రాత్రి 11 గంటల సమయంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈస్ట్‌ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది.

Also Read: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్

ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. కారులో చిరాగ్ విగత జీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వాంకోవర్‌ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైన సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు. చిరాక్‌ హర్యానాకు చెందిన వ్యక్తి. అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అతడి సోదరుడు రోహిత్ అంటిల్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇదిలాఉండగా.. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. విచారణను క్షుణ్నంగా పర్యవేక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.

Also Read: సరోగసీపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Advertisment
తాజా కథనాలు