Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన "23".. ప్చ్‌..! ట్రోలింగ్‌ ఆగెదెప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా టీడీపీకి 98, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. 25 ఇస్తే పావలా అంటారు.. 23ఇస్తే లక్కీ నంబర్ అంటారని జనసేనకు 24 ఇచ్చినా కూడా వైసీపీ మాత్రం ఇంకా 23 నంబర్‌నే హైలేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తోంది.

New Update
Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన "23".. ప్చ్‌..! ట్రోలింగ్‌ ఆగెదెప్పుడు?

Janasena Assembly Seats : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh  Politics) మంచి రసవత్తరంగా తయారయ్యాయి. టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీలు అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం తమ అభ్యర్ధులను రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇందులో టీడీపీకి 98, జనసేనకు 24 సీట్లను ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయమే అక్కడ హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా వైసీపీ(YCP) నేతలు జనసేనకు 24 సీట్లు ఇవ్వడం మీద తెగ ట్రోల్ చేస్తున్నారు. వీరికి తోడు ఆర్జీవీ(RGV) ట్వీట్ కూడా తోడయ్యింది. టీడీపీ లక్కీ నంబర్ 23ను హైలట్ చేస్తూ జనసేన అభ్యర్ధి స్థానాల మీద ట్రోల్స్ నడుస్తున్నాయి.

23 ట్రోలింగ్...

23.. ఈ నంబర్‌కు టీడీపీకి బోలెడంత కనెక్ణ్ ఉంది. 2019 నుంచి 23 నంబర్ టీడీపీని పట్టుకుని వేళాడుతోంది. 2014 నుంచి 2019 వరకు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత అవే 23 స్థానాలు టీడీపీకి దక్కాయి. ఎన్నికలు ఫలితాలు వెలువడి చంఒద్రబాబు ఓడిపోయానని తెలుసుకున్న రోజు కూడా 23. అందుకే ఈ నంబర్ వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు అన్నీ కూడా 23 నంబర్‌తో సంబంధం ఉండేట్టుగానే సాగాయి. రీసెంట్‌గా బాబు అరెస్టయిన తేదీ 9-9-23 ..... సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ 23. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 లో సెప్టెంబర్ 23rd వరకూ జ్యూడీషియల్ రిమాండ్ సీబీఐ కోర్టు(CBI Court) ఇచ్చింది. బాబు ప్రిజన్ నెంబర్ -- 7691.... సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23. చంద్రబాబు కొడుకు పుట్టిన రోజు 23. వ్యూహం సినిమా జనగర్జన ఈవెంట్ 23rd, ఆ సినిమా రిలీజ్ 23rd. ఇన్ని అదే నంబర్‌తో ముడిపడి ఉండటంతో టీడీపీ, చంద్రబాబుకు 23 అనలక్కీ నంబర్ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు ఇప్పుడు ఇది జనసేనాని నెత్తికి కూడా చుట్టుకుంది.


24 సీట్లు వెనుక...

2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి 98 సీట్లు కేటాయిస్తే జనసేనకు మాత్రం 24 సీట్లు కేటాయించారు. దీని వెనుక టీడీపీ శని నంబర్ 23 కారణం అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు, ఆర్జీవీ ఇదే విషయాన్ని ఎత్తి చూపించి మరీ ట్రోల్ చేశారు. ఆ అన్ లక్కీ నంబర్ ఇవ్వకూడదనే 24 సీట్లు ఇచ్చారని...మళ్ళీ 25 ఇస్తే పావలా వాటా అంటారని..మధ్యస్థంగా 24 సీట్లు జనసేనకు కేటాయించారని ఎద్దేవా చేస్తున్నారు. ఆర్జీవీ అయితే ఈ విషయం మీద తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ జనసేన పార్టీని ఆడేసుకుంటున్నాడు.

సొంత పార్టీలోనూ అసమ్మతి...

తమ పార్టీకి కేటాయించిన సీట్ల విషయంలో సొంత పార్టీలోనూ అసమ్మతి రేగుతోంది. జనసేనాని తమ నేతలను, కార్యకర్తలను కూల్ చేయాలని చూస్తున్నా ఆగడం లేదు. కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దని.. విజయంలో 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 24 అసెంబ్లీ సీట్లతో పాటు.. 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే.. మొత్తంగా రాష్ట్రం లోని 40 నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ సర్ది చెబుతున్నారు. కానీ అసంతృప్తి మాత్రం ఆగడం లేదు. కాపు అధినేత హరిరామ జోగయ్య సైతం దీని మీద లేఖ రాశారు. జనసేన పరిస్థితి మరీ ఇంత దారుణమా అంటూ మండిపడ్డారు. పవన్ ఇంతలా అణిగిమణిగి ఉండడం తగదని సూచించారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకోదన్నారు. కనీసం ఎన్నికలు అయిన తర్వాత అయినా అధికారం వస్తే చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, మంత్రి పదవుల్లో చెరిసగం అని ప్రకటిస్తేనే ఈ అసంతృప్తి చల్లారుతుందని చెబుతున్నారు.

24 వెనుక జనసేన లెక్కలు...
జనసేనలో ఒక వర్గం అసమ్మతి వ్యక్తం చేస్తుంటే... మరో వర్గం మాత్రం తమ నాయకుడిని సపోర్ట్ చేస్తున్నారు. జనసేనకు ప్రకటించిన సీట్లు 24, ప్రకటించిన తేదీ 24, ఈ ఏడాది 2024. అంటే సంవత్సరం చివరన 24 సంఖ్య రావడం కలిసొచ్చే అంశమని చెబుతున్నారు జనసైనికులు. అందుకే 24 ను పవన్ సెంటిమెంట్‌గా భావించారని అంటున్నారు. మరోవైపు టికెట్ల సంఖ్య చెప్పినా..అభ్యర్ధుల పేర్లను మాత్రం 5గురివే అనౌన్స్ చేయడం వెనుకా రీజన్ ఉందని చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు 5గురు.. వీరు కౌరవులు 100మందిని మట్టికరిపించారు. వైసీపీని కౌరవ సేనగా భావిస్తున్న జనసేనాని.. తమ పార్టీ తరఫున తొలి దశలో పంచపాండవుల లాగ ఐదుగురి పేర్లు ప్రకటించారని అంటూ పోలికలు పెడుతున్నారు.

ఏది ఏమైనా.. 24 సీట్ల ప్రకటన...23 ట్రోలింగ్ ఇప్పుడు జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. ఎన్నికల ముందు పక్క పార్టీలు ఎప్పుడు దొరుకుతాయా ఏదో ఒకటి అందామా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి టైమ్‌లో వైసీపీకి ఈ 23 నంబర్ బాగా దొరికింది.

Also Read : Business : ఈ సీజన్‌ లో 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం అంటే…!

Advertisment
తాజా కథనాలు