Borewell : బోర్‌బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. చివరికి..

గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లా గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌.. రాత్రంతా శ్రమించి చివరికి బుధవారం తెల్లవారుజామున ఆ బాలుడ్ని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

New Update
Borewell : బోర్‌బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. చివరికి..

2 Year Old Fell Into Borewell : ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నారులు బోరుబావి(Borewell) లో పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర అలా ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా అందులో పడిపోతున్నారు. బోర్‌ బావిలను తవ్వినప్పుడు వాటిపై ఏదైన పెట్టి మూసేయాలని ఎంతచెప్పినా కూడా ఇప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మంగళవారం సాయంత్రం గుజరాత్‌(Gujarat) లోని జామ్‌నగర్‌ జిల్లా గోవానా గ్రామంలో ఓ రెండేళ్ల బాలుడు(2 Year Old Boy) బోరుబావిలో పడటం కలకలం రేపింది.

Also Read : ఆ రాష్ట్రానికి ఎవరూ వెళ్లకండి.. ఒకవేళ ఉంటే తిరిగిరండి: కేంద్రం

సాయంత్రం 6.30 PM గంటలకు ఆ బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. రాత్రంతా సహాయక చర్యలు చేపట్టారు. చివరికి బుధవారం తెల్లవారుజామున బాలుడిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే చికిత్స నిమిత్తం జామ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడ్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు పాల్గొన్నట్లు వివరించారు.

Also read: విజయ్ బాటలో విశాల్.. పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం

Advertisment
తాజా కథనాలు