Encounter Between Indian Army, Terrorists: దక్షిణ కాశ్మీర్‌లో భారత సైనయం రెండు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లను నిర్వహిసతోంది. మొదటి ఆర్మీ ఆపరేషన్ ప్రారంభమైన కొద్ది గంటలకే చినిగాం గ్రామంలో మరో కాల్పుల ఘటన వెలుగు చూసింది. మందుగా ఆర్మీకి లష్కర్ గ్రూప్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఆ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరి కొంత మంది గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆర్మీ జరిపిన కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు మరణించారు.
మరోవైపు ఈరోజు పలు ఘటనల్లో మరికొందరు జవాన్లు కూడా మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్‌లోని కతువా, ఉధంపూర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. కతువా జిల్లాలోని రాజ్‌బాగ్ సమీపంలో వాహనం రోడ్డుపై నుంచి జారి ఉజ్ కాలువలో పడిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఏఎస్‌ఐ పర్షోతమ్ సింగ్ వీరమరణం పొందగా, అతని ఇద్దరు సహచరులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
గత కొన్ని రోజులుగా జమ్మూ-కామీర్‌లో జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్ జగడం ఇది ఆరవసారి. ఇప్పటికిదాదాపు పదిమంది దాకా టెర్రరిస్టులను భారత ఆర్మీ మట్టుబెట్టింది.
Also Read:Telanagna: పదేళ్ళల్లో పరిష్కారం కాని అంశాలపై చర్చించాం- భట్టి విక్రమార్క