Afghanistan : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి

అఫ్ఝనిస్తాన్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

New Update
Afghanistan : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి

Rains : అఫ్ఝనిస్తాన్‌ (Afghanistan) లో భారీ వరదలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వారం రోజుల క్రితం కూడా ఆఫ్ఘాన్‌లో పలు ప్రాంతాల్లో వరదలు (Floods) వచ్చాయి. ఈ ప్రమాదంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఆ దేశంలో ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (UNWFP) వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చేపట్టింది.

Also Read: ప్రపంచాన్ని వణికించిన 5 భారీ తుపానులు ఇవే.. ప్రాణ నష్టం వేలల్లో కాదు లక్షల్లో..!

UNWFP.. ఎక్స్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ.. తమ సంస్థ ఉద్యోగులు బగ్లాన్‌ను అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తున్నారని తెలిపింది. దోషి జిల్లాలో భారీ వర్షాల ప్రభావానికి అధిక నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. లర్ఖబ్‌లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు మృతి చెందినట్లు తెలిపారు. 500లకు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. వరదల ముప్పుతో అఫ్ఘాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు