Ram Mandir : మరో రెండు రోజుల్లో అయోధ్య(Ayodhya) బాల రాముడు కొలువవుతున్నాడు. ఎన్నో ఏళ్ళ హిందూవుల కల మొత్తానికి సాకారం అవుతోంది. దీనికోసం ప్రపంచం మొత్తంలోని హిందువులు(Hindus) ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. రామ్ లల్లా(Ram Lalla) ను దర్శించుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే ఇదేమీ అంత ఈజీగా జరిగిపోలేదు. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. 1528లో పోరాటం 2024లో ముగిసింది.
అసలేంటీ అయోధ్య వివాదం...
అయోధ్య వివాదం 1528లో మొదలైంది. అప్పుడు భారతదేశం మొఘలుల పరిపాలనలో ఉంది. బాబర్ పాలనలో కమాండర్‌గా ఉన్న మీర్ బఖి అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు. అదిగో అక్కడి నుంచి మొదలైంది అసలు గొడవ. మనకు తెలిసిన రామాయణంలో అయోధ్య రాముని(Ram Mandir) జన్మస్థలం. సూర్యవంశీకులు ఇక్కడి నుంచి పాలించారు. రాముడు కూడా వనవాసం నుంచి వచ్చాక అయోధ్య నుంచే పాలించాడు. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది రామలక్ష్మణులు పుట్టింది అయోధ్యలోనే. దాంతో పాటూ ఎక్కడైతే బాబ్రీ మసీదును నిర్మించారో సరిగ్గా అదే స్థలంలో రాముడు జన్మించారని చెబుతారు. అందుకే మసీదు కట్టగానే గొడవలు మొదలయ్యాయి. 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నడిచాయి. మతపరంగా చాలాసార్లు కొట్టుకున్నారు. 1853, 1859 లో ఈ ఘర్షణలు తార స్థాయికి చేరాయి. దీంతో అప్పటి ప్రభుత్వం అయోధ్యలో వివాదాస్పద భూమి చుట్టూ కంచెను కూడా వేసింది.
Also read:2024-25 నుంచి సీబీఎస్ఈలో ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్
స్వాతంత్య్రం తరువాత...
భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మతపరమైన గొడవలు మరింత ఎక్కువ అయ్యాయి. మసీదు(Masjid) లోపల రాముని విగ్రహం ఉందని హిందువులు చెప్పడం మొదలుపెట్టారు. దీంతో స్వయంగా శరీరాముడే సాక్షాత్కరించాడని అన్నారు. దీని మీద కోర్టు కేసులు నడిచాయి. మసీదులో విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం ఆదేశించింది కూడా. ఇక 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. తరువాత 1961లో మసీదులో విగ్రమాలు తొలగించి..ఆ భూమిని తమకు అప్పగించాలని ఉత్తర్ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది అయ్యాక 1986 లో ఉమేశ్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా.. వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి.. హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని చెప్పారు.
1992 అన్నింటికంటే పెద్ద గొడవ...
వీటన్నింటి తరువాత 1992లో అయోధ్యలో అతి పెద్ద గొడవ జరిగింది. 1992 డిసెంబర్ 6న శ్వ హిందు పరిషద్, శివసేన కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చేశారు. ఇది దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే రేపింది. దీంతో చాలా చోట్ల మత ఘర్షణలు జరిగాయి. అయోధ్యతో పాటూ పలు ప్రాంతాల్లో వేలాది మంది చనిపోయారు. దీని తరువాత 2002లో ఇదే ఇష్యూ మీద గురజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు చెలరేగాయి. హిందువులు, ముస్లింలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అప్పుడు జరిగిన మింసాత్మక ఘటనల్లో 2000మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో అయోధ్య వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోరట్ఉ తీర్పు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా విరాజ్మాన్, నిర్మోహి అఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011 లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీం కోర్టులో అనేకమార్లు విచారణ జరిగింది.
2019లో చారిత్రక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
2019 మార్చిలో మధ్యవర్తుల ద్వారా అయోధ్య వివాదాస్పద భూముల మీద నిర్ణయం తీసుకోవాలని 8 వారాల గడువు ఇచ్చింది. అయితే దాంతో ఎలాంటి పరిష్కారం లభించలేదు. తరువాత అప్పటి నుంచి ఈ వివాదం మీద రోజువారీ విచారణ కూడా చేసింది. చివరకు ఆగస్టులో16వ తేదీన అయోధ్య వివాదం మీద తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు బెంచ్. ఇక ఫైనల్‌గా 2019 నవంబర్ 9వ తేదీన కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది.
2020 ఆగస్ట్ 5 శంకుస్థాపన..
కోర్టు తీర్పు తర్వాత 28 ఏళ్ళ పాటూ టెంట్లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్‌కు తరలించారు. 2020 ఆగస్ట్ 5న కొత్త మందిరం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22న కొత్త రామ్ లల్లా విగ్రహంతో నూతన ఆలయాన్ని ప్రాంభించనున్నారు. ప్రధాని మోడీ చేతులు మీదుగా రాముని ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.