OTT : 150 కోట్లు కొల్లకొట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే? మళయాలంలో 150 కోట్లుకొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ మే 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. By Anil Kumar 07 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Aavesham OTT Release: ఈ మధ్య సౌత్ లో ఎక్కడ చుసినా మలయాళ సినిమాలదే హవా నడుస్తోంది. మలయాళ సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. వీటిలో కొన్నింటిని అక్కడి థియేటర్స్ లో రిలీజ్ చేసిన కొన్ని రోజులకు ఇతర భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేస్తుంటే.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ప్రేమలు (Premalu) , మంజుమ్మల్ బాయ్స్ వంటి సినిమాలు భారీ ఆదరణ దక్కించుకోగా.. ఇటీవలే మలయాళంలో 150 కోట్లు కొల్లగొట్టిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. Also Read : ‘పుష్ప’ తో నాకు ఎలాంటి లాభం జరగలేదు.. ఈ విషయం సుకుమార్ కి కూడా చెప్పాను, ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ ఓటీటీలోకి ఫహద్ ఫాజిల్ 'ఆవేశం' మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆవేశం' (Aavesham) ఇటీవల థియేటర్స్ లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో సుమారు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 150 కోట్లు వసూలు చేసింది. 'రోమాంచమ్' సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన జీతూ మాధవన్ 'ఆవేశం' సినిమాలో రేసీ స్క్రీన్ ప్లే తో అదరగొట్టేసారు. సినిమాలో ఫహాద్ ఫాజిల్ తో పాటూ నటించిన నటీ నటులు ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోయినా వాళ్ళు తమ నటనతో ఆకట్టుకున్నారు. మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఈ సినిమాని మే 9 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. థియేటర్స్ లో ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా ఒప్పందం ప్రకారం రిలీజైన 28 రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. #ott #fahadh-faasil #amazon-prime #aavesham-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి