Bus Collided With Truck : అసోం(Assam) లోని గోలాఘాట్ జిల్లా(Golaghat District) లో ఉదయాన్నే విషాదం సంభవించింది. ప్రయాణికులతో ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదం(Accident) లో ఇప్పటివరకు 14 మంది చనిపోయారని తెలుస్తోంది. మరో 25 మంది దాకా గాయపడ్డారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమపంలోని బలిజన్ ప్రాంతంలో తెల్లవారుఝాము 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
Also Read:పెట్రోల్ అయిపోయింది…గుర్రం మీద డెలివరీ
ప్రస్తుతం దేశం అంతటా చలి విపరీతంగా ఉంది. దట్టమైన పొగమంచు రోడ్ల మీద వెళ్ళే వాహనాలకు అడ్డంకిగా మారుతోంది. చాలా రాష్ట్రాలు దీంతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో దీని ప్రబావం మరీ ఎక్కువగా ఉంది. అసోంలో జరిగిన ప్రమాదానికి కూడా ఇదే కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. సరిగ్గా కనిపించకపోవడం వల్లనే బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టి ఉండొచ్చని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడిక్కడే 10 మంది చనిపోయారు.మరో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. క్షతగాత్రుల్లో మరికొంత మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేస్తున్నామని అలాగే దర్యాప్తు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.