London : కత్తితో ఐదుగురుని పొడిచిన దుండగుడు.. ఒకరు మృతి

లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

New Update
London : కత్తితో ఐదుగురుని పొడిచిన దుండగుడు.. ఒకరు మృతి

Murder : లండన్‌(London) లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ 13 ఏళ్ల యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. థర్లో గార్డెన్స్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి వాహనం దూసుకొచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో దుండగుడు ఇళ్ల వద్ద కత్తి పట్టుకుని తిరుగుతూ కనిపించారు. ఇద్దరు పోలీసులతో పాటు మరో ముగ్గరుపై అతడు కత్తి(Sword) తో దాడి చేశాడు. చివరికి పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు.

Also Read: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు 

అయితే అతను ఎవరూ, ఎక్కడి నుంచి వచ్చాడు అనే దానిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనకు ఉగ్రదాడి(Terrorist Attack) తో సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Also Read: ఇంటి మరమ్మత్తులు చేస్తున్న ఓ కుటుంబానికి కిచెన్ లో దొరికిన 50 ఏళ్ల నాటి నిధి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు