Rajya Sabha Byelections: రాజ్యసభ ఉప ఎన్నికలు ముగిసినట్టే. ఖాళీ అయిన 1 స్థానాలకు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ జరగకుండానే ఏకగ్రీవంగా నేతలు ఎన్నుకోబడ్డారు. ఈ ఉప ఎన్నికల కోసం నామినేషన్లను ఆహ్వానిచారు. ఈ నెల 21 వరకు వాటిని స్వీకరించారు. అయితే ఇందులో తొమ్మిది స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికైన నేతలు..
కిరణ్ చౌధరి (బీజేపీ, హరియాణా), మమతా మొహంతా (బీజేపీ, ఒడిశా), మిషన్ రంజన్ దాస్ (బీజేపీ, అస్సాం), రామేశ్వర్ తేలీ (బీజేపీ, అస్సాం), ధైర్యశీల్ పాటిల్ (బీజేపీ, మహారాష్ట్ర), రవ్‌నీత్ సింగ్ బిట్టూ (బీజేపీ, రాజస్థాన్), మనన్ కుమార్ మిశ్ర (బీజేపీ, బిహార్), జార్జి కురియన్ (బీజేపీ, మధ్యప్రదేశ్), రాజీబ్ భట్టాచార్య (బీజేపీ, త్రిపుర), అభిషేక్ మను సింఘ్వీ (కాంగ్రెస్- తెలంగాణ), ఉపేంద్ర కుశ్వాహా (రాష్ట్రీయ లోక్ మోర్చా, బిహార్), నితిన్ పాటిల్ (ఎన్సీపీ-మహారాష్ట్ర-)
ఎన్డీయే మెజార్టీ మార్క్..
ఈ ఉప ఎన్నికల తర్వాత రాజ్యసభలో ఎన్డీయే మెజార్టీ మార్కును అందుకుంది. తాజాగా బీజేపీ నుంచి తొమ్మిది మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడంతో ఈ పార్టీ బలం 96 కి చేరింది. దాంతో పాటూ మిత్రపక్షాలు కలిపి ఎన్డీయే బలం 112 అయింది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. రాజ్యసభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 237.. దీనిలో మెజార్టీ మార్కు 119గా ఉంది. ఇప్పుడు బీజేపీ, మిత్రపక్సాలతో కలుపుకుంటే. ఎన్డీయేకు మెజారిటీ మార్కు లభించినట్టు అయింది. ఇక మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్షం బలం కూడా 85కు చేరుకుంది. ఎగువ సభలో ఇంకా ఎనిమిది స్థానలు ఖాళాగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో నాలుగు, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.