బిహార్‌లో కేవలం రెండు వారాల్లోనే 12 వంతెనలు కూలిపోవడం సంచలనం రేపింది. దీంతో ఈ ఘటనలపై రాష్ట్ర సర్కార్ రంగంలోకి దిగింది. వంతెన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించిన 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కూలిన వంతెన స్థానంలో కొత్త వంతెనల పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ బ్రిడ్జీల నిర్మాణంలో దోషులుగా తేలిన కాంట్రక్టర్ల నుంచే పునర్నిర్మాణ ఖర్చులను సేకరించాలని నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయించింది.
Also read: నీట్ పరీక్ష రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ రిపోర్టులు అందజేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే వంతెనలు కూలిపోవడానికి ప్రధాన కారణాలని నివేదికల్లో తేలింది. ఇక ఇంజనీర్లు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ కొరవడటం వల్ల ప్రమాదాలు జరిగాయని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ ఆరోపించారు.
మరోవైపు బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని.. కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనకు పైగా బ్రిడ్జిలు కుప్పకూలిపోయానని ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా విమర్శలు చేశారు. అలాగే బీహార్‌లో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని.. పేపర్ లీక్ ఘటనలు కూడా వెలుగుచూశాయని అన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎవరూ మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు.
Also Read: భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు