Telangana : ప్రారంభం అయిన పదోతరగతి ఎగ్జామ్స్.. విద్యార్ధులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఎగ్జామ్స్‌కు హాజరవుతున్న విద్యార్ధులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్‌ ద బెస్ట్ చెప్పారు.

New Update
Telangana : ప్రారంభం అయిన పదోతరగతి ఎగ్జామ్స్.. విద్యార్ధులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

10th Exams : తెలంగాణ(Telangana), ఏపీ(AP) ల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. తెలంగాణలో ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్(10th Exams) రాస్తున్నారు. వీళ్లలో 2,57,952 మంది అబ్బాయిలు, 2,50,433 మంది అమ్మాయిలు ఉన్నారు. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(SSC) పరీక్షల్ని కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,762 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాంతో పాటూ ఈసారి గతంలో ఉన్న నిబంధనలను ఎత్తివేసింది విద్యాశాఖ. ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షలకు అనుమతించని రూల్ ను తీసేసి దాని స్థానంలో 5నిమిషాల ఆలస్యం వరకు పరీక్షకు అనుమతినిచ్చారు. ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. స్టూడెంట్స్, తమ హాల్ టికెట్ లేదా ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.

సీఎం విషెస్...

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విషెస్(Wishes) తెలియజేశారు. విద్యార్ధిని,విద్యార్దులకు రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ తెలిపారు. విజయోస్తూ అంటూ శుభాభివందనాలు అంటూ విష్ చేశారు.

పక్కా నిఘా...
సైన్స్‌ మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్‌ పరీక్ష పేపర్‌ -1 (ఫిజికల్‌ సైన్స్‌), పేపర్‌-2 (బయోలాజికల్‌ సైన్స్‌)గా రెండు రోజుల పాటు ఉంటుంది. ఈ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉండనుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 30వేల మంది ఇన్విజిలేటర్లు పరీక్షలను పరిశీలిస్తున్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వాహణలో ప్రశ్న పత్రాల లీకులకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. ప్రశ్నపత్రాల తారుమారు, కాపీయింగ్ పాల్పడకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏదైనా సాయం అవసరమైతే రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూం నంబర్‌కు 040-23230942 కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

Also Read : Telangana : ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు