AP Reorganisation Act: ఎల్లుండే తెలుగు సీఎంల భేటీ.. ఈ పది సమస్యలపైనే ప్రధాన చర్చ? ఏపీ విభజన జరిగి 2024 జులై 2 నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 9వ, 10వ షెడ్యూల్‌లో అనేక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఈ ఏడాది జులై 2 నాటికి పదేళ్లు గడిచింది. అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా 9వ, 10వ షెడ్యూల్‌లో అనేక అంశాలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. అక్కడి భవనాల భూములపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. షెడ్యూల్ 9లో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ, అగ్రో ఇండస్ట్రియల్ అభివృద్ధి సంస్థ, వేర్ హైసింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇరిగేషన్, ఆర్టీసీలో భారీ ఎత్తున స్థిరాస్తులు ఉన్నాయి. వీటన్నింటి పరిష్కారం కోసం కేంద్రం షీలా బిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ కొన్ని సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు. ఇక రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిలు ఓ కొలిక్కి రాలేదు. విభజన సమయంలో ఉద్యోగుల పంపకాల కోసం ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం కమలనాథన్ కమిటీ ఏర్పాటుచేసినప్పటికీ 10 ఏళ్లుగా ఎలాంటి పురోగతి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6వ తేదీన సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read: మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు కలిగే ప్రయోజనమిదే! అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణలో టీడీపీకి కూడా మంచి పట్టు ఉంది. ప్రస్తుతం టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ ప్రభావం కూడా ఉండనుంది. ఈ క్రమంలోనే జులై 6న జరగనున్న రేవంత్, బాబు భేటీపై ఆసక్తి నెలకొంది. గతంలో కొన్ని అంశాలపై హైకోర్టులో ఏపీ సర్కార్ కేసు వేసింది. 9వ షెడ్యూల్‌లో ఏపీ వేసిన రెండు కేసుల వల్ల విభజన హామీలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్(DILL) కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తెచ్చుకుంది. ఈ సమస్య అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. అలాగే పదో షెడ్యూల్‌లో ఉన్నటువంటి ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన సంస్థలకు వర్తింపజేయాలి. అయితే దీనిపై కూడా రిట్ పిటిషన్ దాఖలైంది. దీంతో సంస్థల విభజన ముందుకు కదలడం లేదు. విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) ఉంది. దీని ప్రకారం గాజులరామంలో ఉన్న 271.39 ఎకరాల ల్యాండ్‌ను తమకు కేటాయించాలని తెలంగాణ సర్కార్ కోరింది. అలాగే రంగారెడ్డిలోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షిల్ డిస్ట్రిక్స్‌లో ఉన్న 6,219 చదరపు గజాల భవనాన్ని ఈ చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం ప్రాంతం ఆధారంగా కేటాయించాలని అడిగింది. అయినప్పటికీ APSFC విభజనపై నిపుణు కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరెంట్ బిల్లులపైనా ఇరు రాష్ట్రాల మధ్య లొల్లి నడుస్తోంది. ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి.. తెలంగాణ పవర్ యుటిలిటీస్‌కు దాదాపు రూ.17,828 కోట్లు రావాల్సి ఉన్నాయని తెలంగాణ చెబుతోంది. మరోవైపు ఏపీ జెన్‌కో.. తమకు తెలంగాణ నుంచి రూ.6,283 కోట్లు రావాల్సి ఉన్నాయని.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో 2022 జూన్‌లో ఏపీ జెన్‌కో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. మరోవైపు తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని టీఎస్ జెన్‌కో, టీఎస్ డిస్కమ్స్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇరు రాష్ట్రల వాదనలు కేంద్ర దృష్టికి కూడా వచ్చాయి. అయినప్పటికీ విటికి సంభందించిన సమస్యలు పరిష్కారం కాలేవు. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బయ్యారం వద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఇది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. షెడ్యుల్ 8 ప్రకారం తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ దీనికి సంబంధించి బిల్లు పాస్ చేసింది. ఏడేళ్లకు రెండు దఫాల్లో రూ.889.07 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో బిల్లు ఆమోదించింది. అయినప్పటికీ నిధులు రాకపోవడంతో.. వెంటనే నిధులు విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. అలాగే ఎన్టీపీసీ (NTPC) తెలంగాణలో 4 వేల మెగా వాట్ల విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఈ పనులు పూర్తి కాలేదు. Also Read: బాధ్యత లేదా?: టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి చురకలు షెడ్యూల్ 8 ప్రకారం.. జాతీయ రహదారుల అధికార సంస్థ తెలంగాణలో వెనకబడిన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయాలి. జోగులాంబ గద్వాల, నారాయణపేట్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి ఈ ఐదు జిల్లాలను జాతీయ రహదారుల నెట్‌వర్క్‌కు ఇంకా అనుసంధానించలేదు. అలాగే విభజన చట్టం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాలకు కావాల్సిన నిధులు కేటాయించాలి. అయితే కేంద్రం.. తెలంగాణలోని గతంలో ఉన్న 9 ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున రూ.2,250 కోట్ల నిధులు విడుదల చేసింది. 2015-2016 నుంచి 2018-2019, అలాగే 2020-21కి ఈ నిధులు విడుదల చేసింది. అయినప్పటికీ.. 2019-20202, 2021-2022, అలాగే 2022-2023 ఏడాదికి సంబంధించి ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఇంకా తెలంగాణకు రూ.1,350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. #andhra-pradesh #telugu-news #10-years-of-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి