Pakistan : పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి.. పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. డేరా ఇస్మాయిల్ఖాన్ అనే జిల్లాలో చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 పోలీసులు మృతి చెందగా.. మరో ఆరుగులు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 05 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pakistan Terrorists : పాకిస్థాన్(Pakistan) లో ఉగ్రవాదులు(Terrorists) మరోసారి రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్ఖాన్(Dera Ismail Khan) అనే జిల్లాలో చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఒక్కసారిగా ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మరో ఆరుగురు పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం 3 గంటలకు.. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. Also Read : మంకీ ఫీవర్ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి పోలీస్ భవనం(Police Building) లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ తర్వాత పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే గత కొన్నిరోజులుగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇలాంటి ఉగ్రదాడులు చోటుచేసుకోవడం పాకిస్థాన్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Also Read : ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..స్పష్టం చేసిన కేంద్రం #telugu-news #pakistan #terrorists మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి