Hyderabad: 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు.. 25 ని.ల్లోనే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్‌లో ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌ నుంచి 1.10 కోట్లు పోయాయి. దీని తాలూకా మెసేజ్ వెంటనే వచ్చింది. దీంతో అలర్ట్ అయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే హైదరాబాద్ పోలీసులు కూడా 25 ని. ల్లోనే ఆ సైబర్ దొంగను పట్టేసుకున్నారు.

Hyderabad:  1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు.. 25 ని.ల్లోనే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
New Update

Cyber Crime: సైబర్ నేరం...ఈ రోజుల్లో దీనికి అంతే లేకుండా పోతోంది. రకరకాల మార్గాల ద్వారా డబ్బులు దోచేస్తున్నాఉ సైబర్ నేరగాళ్ళు. కొన్నింటిలో వీరిని పట్టుకోగలుగుతున్నా...చాలా వాటిల్లో దొరక్కుండా తప్పించుకుంటున్నాఉ. సామాన్య మానవుడి దగ్గర నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకూ కూడా సైబర్ నేరగాళ్ళ బాధుతులు ఉన్నారు. వీళ్ళని పట్టుకునేందుకు పోలీసుల్లో ఒక స్పెషల్ టీమ్ ఉంటుంది. అయినా కూడా వీరి ఆగడాలు, దొంగతనాలు ఆగడం లేదు.

తాజాగా హైదరాబాద్‌లో హర్ష్ అనే వ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.10 కోట్లు కొట్టేశారు. వెంటనే వచ్చిన బ్యాంక్ ఎస్సెమ్మెస్‌తో అప్రమత్తమైన బాధితుడు బ్యాంకు సిబ్బందిని, పోలీసులను అలెర్ట్ చేశారు. పోలీసులు కూడా సకాలంలో స్పందించి 25 నిమిషాల్లోనే డబ్బును వెనక్కి రప్పించారు. ఈ నెల 27న హర్ష్ కు మూడు మెసేజ్‌లు వచ్చాయి. అతడి బ్యాంకు అకౌంట్ నుంచి ఉదయం 10.09 గంటలకు రూ.50 లక్షలు, 10.10 గంటలకు మరో రూ.50 లక్షలు, 10.11 గంటలకు రూ.10 లక్షలు మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని. వెంటనే హర్ష్ బ్యాంక్‌కు కాల్ చేసి విషయం చెప్పారు. తాను ట్రాన్షర్ చేయలేదని కన్ఫార్మ చేశారు. దాని తర్వాత 1930 నంబరుకు ఫోన్‌ చేసి జరిగిన మోసాన్ని సైబర్ సెల్‌కు కూడా చెప్పారు.

దీంతో వెంటనే నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (NCRP) నేతృత్వంలోని సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజమెంట్‌ సిస్టమ్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో టీఎస్‌సీఎస్‌బీ కూడా అలర్ట్ అయింది. నేరస్థుడు డబ్బును డ్రా చేయకుండా నిలివేశారు. అప్పటికీ దొంగ కేవలం పదివేలు మాత్రమే డ్రా చేయగలిగాడు. తర్వాత విచారనలో డబ్బులు బెంగళూరులోని అకౌంట్‌కు ట్రాన్షర్ అయ్యాయని తేలింది. ఇవి సజావుద్దీన్‌, సలీముద్దీన్‌ ఖాతాలుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. హర్ష్‌కు వెనక్కు డబ్బులు వచ్చేట్టు చేశారు. డబ్బులు పోయిన వెంటనే గుర్తిస్తే వాటిని వెనక్కు తీసుకురావడం సులభం అని చెబుతున్నారు టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయెల్.

Also Read:Karnataka: జేడీ(ఎస్) పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్

#hyderabad #cyber-crime #bank-account #theft
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe