Bird Flu : విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. కోవిడ్ కంటే దారుణంగా ఉందంటున్న నిపుణులు

కోవిడ్‌ను దాటాం...దాని తరువాత స్టేజ్‌లను కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అంతకు మించిన మహమ్మారి వచ్చేసింది. రావడమే కాదు చాలా వేగంగా వ్యాపిస్తోంది కూడా. అదే బర్డ్‌ఫ్లూ. ఇది సోకిన వారిలో సగం మంది చనిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

New Update
Bird Flu: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

Bird Flu Virus : అదేదో అంటారు కదా... ఇది కలికాలం. మనుషుల వినాశనమే తప్ప మంచి ఉండదు. ఇన్నాళ్ళు అదంతా ట్రాష్ అని కొట్టిపడేసినా ఇప్పుడు న్మక తప్పేలా కనిపించడం లేదు. మొన్ననే మహమ్మారి కోవిడ్(Covid) బారి నుంచి చావు తప్పి కన్నులొట్టపోయి తప్పించుకుంది ప్రపంచం. ఇంకా దాని గుర్తులు పూర్తిగా చెరిగిపోనే లేదు. అప్పుడే మరో మహమ్మారి ముంచుకొచ్చేస్తోంది. పైగా ఇది కోవిడ్ కంటే భయంకరంగా కూడా ఉంటుందని చెబుతున్నారు.

బర్డ్‌ఫ్లూ(Bird Flu)... ఇప్పుడు అందరినీ భయపెడుతున్న మహమ్మారి. అమెరికా(America) లో మొదలైన ఈ వైరస్ నెమ్మదిగా తన కోరలను చాస్తోంది. బర్డ్‌ఫ్లూ H5N1 అనే వైరస్ క్లిష్టస్థాయికి చేరుకుంటోందని చెబుతున్నారు నిపుణులు. ఇది ఇంతకు ముందు కేవలం పక్షుల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు క్షీరదాలకు, మానవులకు కూడా సోకుతోంది. ఇది సోకిన వారిలో సగం మంది చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు ప్రముఖ బర్డ్ ఫ్లూ నిపుణులు డాక్టర్ సురేష్ కూచిపూడి. ఇది ఎప్పుడో వస్తుంది అని చెప్పడం లేదు. ఆల్రెడీ జంతువుల్లో, మనుషుల్లో ఇది వ్యాపించేసిందని అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

కోవిడ్ కంటే బర్డ్‌ఫ్లూ వందరెట్లు అధ్వాన్నంగా కనిపిస్తోందని అంటున్నారు కెనడా(Canada) కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయో నయాగరా వ్యవస్థాపకుడు జాన్ ఫుల్టన్. మరో రెండు,మూడేళ్ళల్లో ఇది మొత్తం వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి నుంచే దీని గురించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని...ఎప్పటికి వస్తుందో మాత్రం ఇంకా కన్ఫార్మ్‌గా తెలియదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, H5N1 బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది 2003 నుండి మరణించారు, మొత్తం 887 కేసులలో 462 మంది మరణించారు. ఇక అమెరికాలోని మనువులకు ఇది సోకడం మొదలైంది. అక్కడ మిషిగాన్‌ స్టేట్‌లో క్షీరదం నుంచి బర్డ్‌ఫ్లూ మనిషికి సోకిన మొదటి కేసు నమోదయిందని చెబుతున్నారు.

బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ(Bird Flu) అనేది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా(Influenzaఅని కూడా పిలువబడే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఒక పక్షి నుంచి మరో పక్షికి వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ ప్రాణాంతక రకం హెచ్ 5 ఎన్ 1. హెచ్5ఎన్1 వైరస్ సోకిన పక్షులు చనిపోతాయి. ఈ వైరస్ సోకిన పక్షుల నుంచి ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుంది. 1997లో హాంకాంగ్‌లో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. ఆ సమయంలో కోళ్ల ఫారాల్లో వ్యాధి సోకిన కోళ్లే ఈ వ్యాప్తికి కారణమని తేలింది. 1997లో బర్డ్ ఫ్లూ సోకిన వారిలో 60 శాతం కోళ్లు చనిపోయాయి. సోకిన పక్షి మలం, ముక్కు స్రావాలు, నోటి లాలాజలం లేదా కళ్ల నుంచి వచ్చే నీరు తాకడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. బర్డ్ ఫ్లూ సహజంగా వలస జల పక్షుల నుంచి ముఖ్యంగా అడవి బాతుల నుంచి వ్యాపిస్తుంది. ఈ అడవి పక్షుల నుంచి ఈ వైరస్ దేశీయ కోళ్లకు వ్యాపిస్తుంది. అడవి పక్షుల నుంచి పందులు, గాడిదలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 2011 నాటికి ఈ వ్యాధి బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, భారత్‌, ఇండోనేషియా, వియత్నాం దేశాలకు వ్యాపించింది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇక కొన్ని నివేదికల ప్రకారం ఈ ఫ్లూ చైనాలోని పక్షుల మార్కెట్ నుంచి వ్యాపించిన వ్యాధి!

Also Read : India Vs Pakistan: 20మంది వ్యక్తుల హత్య..భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు