Zomato: జొమాటో కొత్త ఫీచర్‌...రెండు రోజులు ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు!

ప్రముఖ ఫుడ్ యాపింగ్‌ సంస్థ జొమాటో తన వినియోగదారులకు మరో సరికొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ యాప్‌ వల్ల కస్టమర్లు తమకు కావాల్సిన ఫుడ్‌ని రెండు రోజుల ముందుగానే షెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ట్విటర్ వేదికగా తెలిపారు.

Zomato: శాకాహారం ఆర్డర్‌ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో!
New Update

Zomato: కస్టమర్ల అభిరుచులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో. కొద్ది రోజుల క్రితం చిల్లర కష్టాలకు చెక్‌ పెడుతూ..ఇన్‌ స్టంట్‌ క్రెడిట్ సదుపాయాల్ని ఈ సంస్థ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ మరో కొత్త యాప్‌ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

ఆర్డర్‌ షెడ్యూలింగ్‌ పేరుతో సరికొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ట్విటర్ వేదికగా తెలిపారు.''జొమాటో కస్టమర్లు వారి ఆర్డర్‌ లను రెండు రోజుల ముందుగానే షెడ్యూల్‌ చేసుకొనేందుకు ఈ కొత్త ఫీచర్‌ అనుమతిస్తుంది.

దీంతో వినియోగదారులు ఎంచుకున్న సమయానికే డెలివరీ పార్ట్‌నర్లు ఆర్డర్‌ ను అందిస్తారు.ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, చంఢీగడ్‌, లఖ్‌నవూ, జైపూర్‌ ప్రాంతాల్ఓని 13 వేల అవుట్‌లేట్ల లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఇందులో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తంతో మాత్రమే ఆర్డర్‌ లను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. అని గోయల్‌ వివరించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ ను ఆయన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అతి త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ ఫీచర్‌ ను విస్తరింపజేయనున్నట్లు వివరించారు.

Also Read: రిటైర్డ్‌ అయ్యే ఉద్యోగుల‌కు నో ట్రాన్స్‌ఫర్స్‌!

#new-feature #zomato #two-days #advance #twitter
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe