No Petrol :పెట్రోల్ అయిపోయింది... గుర్రం మీద డెలివరీ

దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రెండురోజుల పాటూ సమ్మె చేయడంతో పెట్రోల్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలామంది వాహనదారులు పెట్రోల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన ఒక డెలివరీ బాయ్ ఆప్షన్ లేక గుర్రం మీద వెళ్ళి మరీ డెలివరీ చేశాడు.

New Update
No Petrol :పెట్రోల్ అయిపోయింది... గుర్రం మీద డెలివరీ

Delivery on Horse : హిట్ అండ్ రన్(Hit and Run) కొత్త యాక్ట్ ప్రజల తల ప్రాణం తోకకు తెస్తోంది. దీనికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు(Truck Drivers) సమ్మె చేయడం ఏమో కానీ నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ దొరక్క జనాలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ బంకులు ముందు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పాపం ఇలాగే నానాపాట్లు పడ్డాడు. పెట్రోల్ కోసం నాలుగు గంటలు క్యూ లైన్‌లో నిల్చున్నాడు. అయినా పెట్రోల్ దొరకలేదు. దీంతో విసుగుచెంది ఏకంగా గుర్రం మీద ఫుడ్ డెలివరీ(Delivery on Horse) చేయడానికి వెళ్ళాడు.

Also Read:జపాన్‌లో 62కు చేరుకున్న మృతుల సంఖ్య

చంచల్ గూడలో గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేయడానికి వెళతున్న వ్యక్తి అక్కడ అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు కాస్తా వైరల్ గా మారింది. సూపర్ ఐడియా అని కొందరు మెచ్చకుంటున్నారు. మరికొందరు డెలివరీ బాయ్ డెడికేషన్‌కు ముచ్చటపడుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న డెలివరీ బాయ్స్ మాత్రం ఎంచక్కా ఏ ఇబ్బందులూ పడకుండా తమపని తాము చేసుకుని వెళ్ళిపోయారు.

నిన్న కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్‌తో జరిపిన చర్చలు సక్సెస్ అవడంతో వారు సమ్మెను విరమించారు. దీంతో నిన్న సాయంత్రమే ట్రక్కులు అన్నీ బయలుదేరాయి. ఈరోజు ఉదయం ఎలా అయినా అవి గమ్యస్థానాలకు చేరతాయి. దీంతో రాత్రితో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు