కేసీఆర్.. మీ అవినీతికి కాలం చెల్లింది.. షర్మిల ఫైర్!

సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడిందని.. తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అంటూ ఫైర్ అయ్యారు.

కేసీఆర్.. మీ అవినీతికి కాలం చెల్లింది.. షర్మిల ఫైర్!
New Update

సీఎం కేసీఆర్(KCR)పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila). కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఆమె ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి బయటపడిందని.. తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అంటూ ఫైర్ అయ్యారు.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఆమె ట్విట్టర్‌లో.. "పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్కుంది దొరగారి కమీషన్ల కాళేశ్వరం దుస్థితి.. నా రక్తం, నా చెమట అని కల్లబొల్లి మాటలు చెప్పి..కట్టింది ప్రాజెక్ట్ కాదు పేక మేడ అని బయట పడ్డది. తెలంగాణ ప్రజల సంపద 1.27 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్లు? ఏం ఉద్ధరించినట్లు? మేడిగడ్డ బ్యారేజ్‌పై డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీ మెగా అవినీతికి, మెగా పనితనానికి నిదర్శనం. వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాల్సిన బ్యారేజ్‌లు.. కట్టిన నాలుగేళ్లకే ముక్కలైన ఘనత ప్రపంచలోనే మన మెగా కేసీఆర్‌కే దక్కింది. 80 వేల పుస్తకాలు చదివిన దొర మెగా ఇంజినీరింగ్ పనితనం ప్రపంచానికి తెలిసింది. లోపాలు కళ్లముందు కొట్టొచ్చినట్లు కనపడుతుంటే.. దొర లక్ష కోట్ల దోపిడీ జనాలకు అర్థమైతుంటే.. బీటలు బారడం కామనట... నెర్రెలు రావడం సహజమట... ఇంతకాలం జనాలను మభ్యపెట్టింది చాలు కేసీఆర్ గారు. మీ దోపిడీ పాపం పండింది. మీ అవినీతికి కాలం చెల్లింది. తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వెంటనే ఒక దర్యాప్తు కమీషన్ ను వేయాలని.. జరిగిన అవినీతిపై విచారణ తక్షణం చేపట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది." అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షర్మిల పోస్టుకు మద్దతుగా కాళేశ్వరంపై విచారణ జరపాలంటూ రీట్వీట్లు చేస్తున్నారు.

Also Read: AI వాడకంపై కొత్త రూల్స్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన!

#sharmila #cm-kcr #kaleswaram-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe