ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకొని వచ్చారు. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఈ భేటీలో స్పష్టత రానుంది. మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టనుంది. అలాగే మూడు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీఎల్పీ భేటీ జరగనుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read : అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు