YCP : పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి.. నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు! మాజీ మంత్రి పేర్నినాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు. By Bhavana 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Machilipatnam : కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలుకా పోసలీసు స్టేషన్ ముందు వైసీపీ(YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) , ఆయన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి(Perni Krishna Murthy) (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో అనుచరులతో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసు స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ లో ఉన్న ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు. స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను, కుర్చీలను, ఇతర సామాగ్రిని పేర్ని అనుచరులు ధ్వంసం చేశారు. స్టేషన్ ముందు పేర్ని నాని, ఆయన కుమారుడు బైఠాయించి నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. తెలుగుదేశం పార్టీ(TDP) సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్‌లపై 50వ డివిజన్‌కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తల పై కేసులు పెట్టడంతో పాటు ఎస్ఐ కొట్టారంటూ పేర్ని నాని ఆరోపించారు. ఎస్సై కావాలనే వారికి కొమ్ము కాస్తూ తప్పు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలని వాళ్లని విచక్షణారహితంగా కొట్టడం ఎంత వరకు సబబు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.ఎస్సైపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేపడతామని డీఎస్పీ అబ్దుల్ సుభానీ తెలిపారు. Also read : మ్యాచ్‌కు ముందు పవన్ పాట వింటా: యువ క్రికెటర్ నితిశ్ రెడ్డి! #ycp #tdp #machilipatnam #perni-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి