/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/nitish-jpg.webp)
Pawan Song : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్(IPL Fever) నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో సన్రైజర్స్ ఆటగాడు.. హైదరాబాద్(Hyderabad) అల్ రౌండర్ , తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పేరు కూడా వైరల్ అవుతుంది. మంగళవారం పంజాబ్ కింగ్స్(Punjab Kings) తో జరిగిన మ్యాచ్ లో నితిశ్ ఓ రేంజ్ లో చెలరేగిపోయాడు.
10 ఓవర్లకు సన్రైజర్స్ స్కోరు 64 పరుగులే ఉన్నాయి.. అలాంటింది 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 182 స్కోర్ చేసిందంటే దానికి కారణం తెలుగబ్బాయి నితిశ్ కుమారే. క్రీజులో పరిస్థితులు అనుకూలించనప్పటికీ కూడా చెలరేగి ఆడి 37 బంతుల్లో .. 4 ఫోర్లు, 5 సిక్స్ లతో 64 పరుగులు చేశాడు. రెచ్చిపోయి ఆడిన 20 ఏళ్ల నితీష్ పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నితీశ్ రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అని తాజాగా ఈ తెలుగబ్బాయి వివరించాడు. ఆటకు దిగే ముందు జానీ చిత్రం లోని ‘నారాజుగాకురా మా అన్నయ్యా.. నజీరు అన్నయా.. ముద్దుల కన్నయ్య.. అరె మనరోజు మనకుంది మన్నయ్యా’ అనే పాటను వింటానని నితిశ్ వివరించాడు.
Nitish video tho tagulko chinna @SunRisershttps://t.co/05cMWx8PkUpic.twitter.com/1vH0TWx6WW
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 9, 2024
ఆ పాట తనకు ఎనర్జీ బూస్టర్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నితీశ్ స్వయంగా ఆ పాటను పాడి వినిపించాడు కూడా. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులతో పాటు అటు మెగా ఫ్యాన్స్ కూడా తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read : ఘోర ప్రమాదం .. 40 అడుగుల గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!