Assembly Elections 2024 : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాజకీయాలు(Politics) రసవత్తరంగా మారుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీ(YCP Party) ప్రయత్నిస్తుండగా.. జగన్ సర్కార్(Jagan Sarkar)ను గద్దె దించాలని టీడీపీ-జనసేన(TDP - Janasena) పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను కూడా ప్రకటించేశారు. మరికొన్ని రోజుల్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా రానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 12.00 PM గంటలకు వైసీపీ.. 2.45 PM టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నోటిసుల్లో తెలిపారు.
Also Read: కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ ఆనం రామనారాయణ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. స్పీకర్ ఎదుట హాజరై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వనున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 2 వరకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది.
Also Read: చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంలో నేడు విచారణ