YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!

రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు.

YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!
New Update

Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్ రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల మూడో విడత పంపిణీకి రంగం సిద్ధం చేసింది. 2023–24 సీజన్‌ పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్‌–2022 సీజన్‌లో అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో నెల 28న రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

తాడేపల్లిలో బటన్ నొక్కి..
ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్‌ నొక్కనున్నారు. ఇప్పటికే రైతు భరోసా కింద గడిచిన ఐదేళ్లలో రూ.34,288 కోట్లు సాయం చేసినట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రైతు భరోసా నిధులు 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: మంగళగిరిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను జాతికి అంకితం చేయనున్న మోడీ !

ఇక ఈ మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమ చేయనున్నారు. అలాగే రబీ 2021 - 22, ఖరీఫ్‌ - 2022 సీజన్‌లో సున్నా వడ్డీ రాయితీకి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.215 కోట్లు జమ చేస్తారు. మొత్తంగా ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

#ap #cm-jagan #ysr-rythu-bharosa #february-28
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి