కడప నుంచి తాను ఎంపీ గా పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కడప నుండి పోటీ చేయమని చెప్తే తాను రెడీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. హైకమాండ్ ఆమోదం పొందిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తామన్నారు. ఎవరు పగటి కలలు కంటున్నారో ప్రజలకు తెలుసన్నారు.
విభజన హామీలు, అమరావతి, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడైన అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు తేలేకపోయారో సజ్జల సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమన్నారు. ఎంపీగా ఉండి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాటం చేయలేదో అవినాష్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.