YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. By Nikhil 21 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి కడప నుంచి తాను ఎంపీ గా పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కడప నుండి పోటీ చేయమని చెప్తే తాను రెడీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. హైకమాండ్ ఆమోదం పొందిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తామన్నారు. ఎవరు పగటి కలలు కంటున్నారో ప్రజలకు తెలుసన్నారు. విభజన హామీలు, అమరావతి, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడైన అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు తేలేకపోయారో సజ్జల సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమన్నారు. ఎంపీగా ఉండి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాటం చేయలేదో అవినాష్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. #mp-elections-2024 #ap-congress #ys-sharmila #kadapa-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి