YS Sharmila: ఇలాంటి వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు?.. అన్న జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల..! ఆంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం తెచ్చే వరకు ఎక్కడికి కదిలేదే లేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ నా పుట్టినిల్లు.. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను..ఏం చేసుకుంటారో చేసుకోండి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజుకో జోకర్ ను తెస్తూ తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila: వైఎస్సార్ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని రాజశేఖర్ రెడ్డి నిరూపించాడన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. పార్టీలకు అతీతంగా అందరూ పథకాలు పొందారని అన్నారు. ఇది వైఎస్సార్ మార్క్ రాజకీయం అని కొనియాడారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ..కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేదని.. 20 వేల ఉద్యోగాలు..లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేదని వ్యాఖ్యనించారు. Also Read: ప్రజలకు పథకాలు కాదు..అభివృద్ధి కావాలి : ఎమ్మెల్యే వసంత కడప స్టీల్ కలే.. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ (CM Jagan) అన్న రెండు సార్లు కడప స్టీల్ (Kadapa Steel) కు శంకుస్థాపన చేశారని.. కడప స్టీల్ ఒక కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో కడప నుంచి బెంగళూర్ వరకు రైల్వే లైన్ అనుమతి తెచ్చారని.. కానీ, జగన్.. ఈ రైల్వే లైన్ అవసరం లేదని లేఖ రాసి ఒక చిన్న లైన్ చాలని సర్దుకున్నారన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఇంత వరకు మరమ్మత్తులు లేవని విమర్శలు గుప్పించారు. రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వారసులా? బీజేపీని పోలవరం అడిగే సత్తా లేదు..హోదా కోసం కొట్లాడే పరిస్థితి వైసీపీకి (YSRCP) లేదని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేనీ మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు? అని జగన్ ను ప్రశ్నించారు. జగన్ ఆన్న క్యాడర్ కి, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తుకు లేవని ధ్వజమెత్తారు. తనపై తప్పుడు స్టోరీలు అల్లుతున్నారని..రోజుకో జోకర్ ను తెస్తున్న బురద చల్లుతున్నారని మండిపడ్డారు. Also Read: చంద్రబాబు చేసింది ఏ మాత్రం కరెక్ట్ కాదు: హరిరామజోగయ్య ఏమైనా చేసుకోండి.. తాను ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నానని.. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారని నిప్పులు చెరిగారు. ఎవరెంత నిందలు వేసినా ఎక్కడికి వెళ్లేదేలేదని..ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చానని..ప్రత్యేక హోదా వచ్చే వరకు..పోలవరం తెచ్చే వరకు ఎక్కడికి కదలనని తేల్చి చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండని ధ్వజమెత్తారు. #ys-sharmila #cm-jagan #ap-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి