YCP MLA: ప్రజలకు పథకాలు కాదు..అభివృద్ధి కావాలి : ఎమ్మెల్యే వసంత

అభివృద్ధి విషయానికి వచ్చే సరికి గొంతులో వెలక్కాయ పడినట్లు ఉందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రజలు పథకాలు కాకుండా..అభివృద్ధి కావాలంటున్నారని అన్నారు.

New Update
YCP MLA: ప్రజలకు పథకాలు కాదు..అభివృద్ధి కావాలి : ఎమ్మెల్యే వసంత

MLA Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లాలో  జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయానికి వచ్చే సరికి గొంతులో వెలక్కాయ పడినట్లు ఉందన్నారు. జి.కొండూరు నుండి గంగినేని రహదారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.

Also Read: ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ వాయిదా.!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించిన సంక్షేమ పధకాలు వంద శాతం జరుగుతున్నాయని..పధకాలు ప్రతి ఒక్కరికీ బర్త్ రైట్ అయిపోయాయని అన్నారు. కానీ, ప్రజలు పథకాలు కాకుండా..అభివృద్ధి కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు. సుమారు 33కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్ ఇప్పటికే 9కోట్ల రూపాయలు వెచ్చించారని..ఆ నిధులు వస్తే 15 రోజుల్లో రహదారి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

Also Read: చంద్రబాబు చేసింది ఏ మాత్రం కరెక్ట్ కాదు: హరిరామజోగయ్య

ముఖ్యమంత్రి ఆఫీస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్లు తెలిపారు. రోడ్డు పూర్తయితే గ్రామస్తులకు అవస్థ తప్పుతుందన్నారు. ఈ క్రమంలోనే క్యాడర్ కు తన సీటుపై ఏమీ చెప్పలేనని అన్నారు. సీఎం స్పష్టత ఇస్తారని కామెంట్స్ చేశారు. ఆ తరువాత ఫ్రిబ్రవరి 4, 5 తారీఖుల్లో మీడియా సమావేశం పెట్టి తన మనో భావాలను తెలియజేస్తానన్నారు ఎమ్మెల్యే వసంత.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు