YS Sharmila: బైబై కేసీఆర్.. షర్మిలా సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కేసీఆర్.. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనకూడదంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఫలితాల తర్వాత ఒక పార్టీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయకూడదన్నారు. By B Aravind 02 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. రేపు (ఆదివారం) ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కేసీఆర్‌కు ఓ సూట్‌కేస్‌ను గిఫ్ట్‌గా తీసుకొచ్చింది. దానిపై బైబై కేసీఆర్ అని రాసుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన షర్మిలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఫలితాలు వెల్లడయ్యాకా ఎవరు గెలిచినా దీనిని కేసీఆర్ ప్రజల తీర్పుగా స్వీకరించాలని అన్నారు. గతంలో చేసినట్లుగా మళ్లీ మిగతా పార్టీ అభ్యర్థులను కొనకూడదూ అంటూ వ్యాఖ్యానించారు. 2014, 2018లో ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ మొత్తం 45 మంది గెలిచిన వాళ్లని కొన్నారని ఆరోపించారు. 40 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీని కొన్నారని తెలిపారు. 2014లో టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి ఏడు గురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అన్నారు. అలాగే 2018లో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. Also Read: మా అభ్యర్థులతో కేసీఆర్ సంప్రదింపులు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ మళ్లీ ఇది రిపీట్ చేయకూడదని.. మిగతా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనకూడదని షర్మిలా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనని షర్మిలా ఆరోపించారు. కేసీఆర్ అవినీతి చేశాడంటూ తీవ్రంగా విమర్శలు చేసిన బీజేపీ అగ్రనేతలు.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఒకటి కాకపోతే.. వీటి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఫలితాలు వచ్చిన తర్వాత ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వకూడదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ పార్టీలు తమ నిర్దోశిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. #telugu-news #telangana #ys-sharmila #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి