Y.S Sharmila Son Marriage : 'అందులో నిజం లేదు..' క్లారిటీ ఇచ్చిన చట్నీస్!

షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం త్వరలోనే జరగనుంది. రాజా రెడ్డి, ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలె్‌సలో నిర్వహించనున్నట్లు సమాచారం. జనవరి నెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలిసింది.

New Update
Y.S Sharmila Son Marriage : 'అందులో నిజం లేదు..' క్లారిటీ ఇచ్చిన చట్నీస్!

Y.S Sharmila Son Marriage : YSRTP అధ్యక్షురాలు YS షర్మిల(YS Sharmila) ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. రీసెంట్ గా షర్మిల కుమారుడు రాజా రెడ్డి, ప్రియ అట్లూరి ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. ఆ మధ్యలో వీరిద్దరి కలిసి ఉన్న ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా షర్మిల తల్లి విజయమ్మ రాజా రెడ్డి ప్రేమించిన ప్రియకు చీర పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ కావడంతో వీరి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం 2024లో ఫిబ్రవరి 17 న జరగనున్నట్లు సమాచారం. రాజా రెడ్డి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి ప్రియను వివాహం చేసుకోనున్నారు. ప్రియ అమెరికాలోనే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. రాజా రెడ్డి కూడా అక్కడే మాస్టర్స్ పూర్తి చేశాడు. కొంత కాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల నిర్ణయంతో పెళ్ళికి సిద్ధమయ్యారు. ప్రియ పేరున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి శ్రీనివాస్ అట్లూరి అమెరికాలోనే సెటిల్ అయ్యారు. జనవరి నెలలో రాజా రెడ్డి, ప్రియల ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోనే జరగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలె్‌సలో వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. రాజా రెడ్డి, ప్రియ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకలు కేవలం ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

publive-image

రాజా రెడ్డి, ప్రియల ప్రేమ వివాహం గురించి తెలిసినప్పటి నుంచి.. అమ్మాయి కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపించాయి. ప్రియా తండ్రి శ్రీనివాస్ ప్రియా చట్నీస్ అధినేత ప్రసాద్ కుమారుడు అంటూ నెట్టింట్లో ప్రచారం జరిగింది. కానీ వాటిలో వాస్తవం లేదు. అయితే ఇటీవలే శ్రీనివాస్ కు తమ అధినేత ప్రసాద్ కు సంబంధం లేదని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

publive-image

Also Read: Y.S Sharmila Son Marriage: షర్మిల కుమారుడు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

Advertisment
Advertisment