YS Sharmila: 'మీ నీచ రాజకీయాలు' అంటూ ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ AP: ప్రధాని మోదీపై షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ను అబద్దాల కార్ఖానాగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ చేసే నీచ రాజకీయాలు, మోసపూరిత చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రపూరిత కోరలు, ఇవన్నీ యావత్ దేశం గమనిస్తోందని అన్నారు. By V.J Reddy 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila Tweet on Modi: ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ను అబద్దాల కార్ఖానాగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ చేసే నీచ రాజకీయాలు, మోసపూర్తి చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రపూరిత కోరలు, ఇవన్నీ యావత్ దేశం గమనిస్తోందని అన్నారు. షర్మిల ట్విట్టర్ లో (X)లో .. " ఝూట్ బోలో, బార్ బార్ ఝూట్ బోలో " అంటూ పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా నడుపుతూ, మాటిమాటికీ, ముమ్మాటికీ దేశ ప్రజలను మభ్యపెడుతూ, సంస్కారం, విచక్షణ కోల్పోయి సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఫాసిస్టు పాలన నడుపుతున్న నరేంద్ర మోదీ గారు. మీకో సూటి ప్రశ్న. వీరోచిత పోరాటపటిమ, అద్భుత వాగ్ధాటి, మనసా వాచా కర్మణా దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన, ఇలాంటి లక్షణాలు నింపుకున్న రాహుల్ గాంధీ గారిని అవమానిద్దామనుకుని, అడ్డుకుంటూ, అయన దిష్టి బొమ్మలను కాల్పించే నీచ సంస్కృతితో ఏమి సాధిస్తారు మీరు, మీ పార్టీ చెంచాలు! ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని మర్చిపోతున్నారు. Also Read: గ్రాండ్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి.. రెసెప్షన్ కు వచ్చిన సినీ ప్రముఖులు, స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య! మీ నీచ రాజకీయాలు, మోసపూర్తి చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రపూరిత కోరలు, ఇవన్నీ యావత్ దేశం గమనిస్తోంది, మీ మాయమాటలతో మోసపోయేంత అమాయకులు కారు ప్రజలు. మణిపూర్ నరమేధంతో తరతరాల భవితకు సర్వనాశనం జరుగుతుంటే పర్యటించలేని పిరికి ప్రభుత్వం మీది. మీరా దేశానికి మంచి చేసేది, మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది. దిష్టి బొమ్మలే కాదు, గోద్రా, మణిపుర్లు కూడా తగలబెట్టించిన నైజము మోదీది. ఐక్యత, ప్రేమ, శాంతి, సోదరాభావం కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది." అని రాసుకొచ్చారు. #pm-modi #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి